
-సీనియర్ జర్నలిస్టు వై.నరేందర్ రెడ్డి
హైదరాబాద్, ప్రతినిధి : పొలిటికల్ ఫ్యాక్టరీ వెబ్ చానల్ అద్భుతంగా తీర్చిదిద్దారని సీనియర్ జర్నలిస్టు వై. నరేందర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పొలిటికల్ ఫ్యాక్టరీ వెబ్ చానల్ ప్రారంభోత్సవం పొలిటికల్ ఫ్యాక్టరీ సీఈవో, చీఫ్ ఎడిటర్ అయిలు రమేశ్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి అతిథిగా హాజరైన నరేందర్ రెడ్డి.. మాట్లాడుతూ మిత్రులు రమేశ్ ఏడాది కిందట ప్రారంభించిన పీఎఫ్ కు ఎంతో ఆదరణ లభించిందన్నారు. ఎంతో కృషి చేసి దాన్ని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించి దాన్ని విజయవంతం చేశారు. ఇఫ్పడు వెబ్ డిజిటల్ టీవీ చానల్ ప్రారంభిస్తున్నారు. రానున్న కాలంలో ఇది మరింత అబివృద్ది చెందుతుంది. ఇంటర్నెట్ యుగంలో వీటికి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. కొత్త గా హీరోయిన్ గా వచ్చిన తార పద్మకు మరిన్ని అవకాశాలు వచ్చి ఎదగాలని ఆకాంక్షించారు.