పొలిటికల్ ఫ్యాక్టరీ.కామ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు

00ailu

కరీంనగర్ : ప్రముఖ వెబ్ సైట్ అయిన పొలిటికల్ ఫ్యాక్టరీ.కామ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ స్థాయిలో షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు పొలిటికల్ ఫ్యాక్టరీ.కామ్ సీఈవో, చీఫ్ ఎడిటర్ అయిలు రమేశ్ తెలిపారు. నగరంలోని ప్రెస్ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిల్మ్ మేకింగ్ విభాగంలో ప్రతిభ గల యువతీ యువకుల ను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

షార్ట్ ఫిలిం కాంపిటీషన్ లో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.15వేల నగదు.. ద్వితీయ బహుమతిగా రూ.10వేలు, తృతీయ బహుమతిగా రూ. 5వేల రూపాయలను అందించనున్నట్టు రమేశ్ తెలిపారు. సినీ రంగానికి చెందిన ఇరువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారన్నారు. సినీరంగంలో ఉన్న అపార అవకాశాలను తెలంగాణ ప్రాంతంలోని యువత అందిపుచ్చుకునేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు.

పోటీల్లో పాల్గొనే యువతీ, యువకులు తాజాగా చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్ లను మాత్రమే పోటీలకు పంపాలని కోరారు. పోటీల్లో పాల్గొనే ఔత్సాహికులు తమ షార్ట్ ఫిల్మ్ ను ప్లాట్ నంబర్ 404, విజయసాయి ఎన్ క్లేవ్, న్యూమారుతినగర్, దిల్ సుఖ్ నగర్, హైదరాబాద్ చిరునామాకు ఫిబ్రవరి 15వ తేదీలోగా పంపించాల్సి ఉంటుందని తెలిపారు. వివరాలకు 9701766055 ను సంప్రదించాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *