
పవర్ స్టార్, ప్రశ్నించే స్టార్ పవన్ కళ్యాన్ పార్టీ జనసేనకు తెలంగాణ ఎలక్షన్ కమీషన్ రాజకీయ పార్టీగా గుర్తించింది.. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణ లో ఏదైనా గుర్తుతో జనసేన ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కింది..
త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొలిటికల్ పార్టీగా జనసేన పోటీ చేసే అవకాశాలున్నాయి. గతంలో పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. ఈనేపథ్యంలోనే రాజకీయ పార్టీగా గుర్తింపు రావడంతో మార్గం సుగుమం అయ్యింది..
కాగా ఆంధ్రాలో కూడా గుర్తింపు పొంది రాజకీయ పార్టీగా అక్కడ పోటీచేస్తామని పవన్ సన్నిహితులు చెప్పారు. ఏపీలో కూడా పార్టీగా దరఖాస్తు చేశామన్నారు.