Breaking News

పొన్నాల మార్పునకు అధిష్టానం యోచన

Ponnala-Lakshmaiah

-మొన్నటి డిగ్గీరాజా పర్యటన తర్వాత మారిన సమీకరణాలు
-పొన్నాలను సాగనంపేందుకు ప్లాన్
-ఉత్తమ్, భట్టి, జీవన్ రెడ్డిల పేర్లు పరిశీలన
హైదరాబాద్, ప్రతినిధి : ఎన్నో వ్యయప్రయాసలకు కాంగ్రెస్ అధిష్టానం, సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది. పార్లమెంట్ దీనికోసం ఫైట్ కూడా జరిగింది. ఇంత చేసి తెలంగాణను క్యాష్ చేసుకోలేక.. అధికారాన్ని టీఆర్ఎస్ కు అప్పగించారు కాంగ్రెస్ నాయకులు. సమష్టితత్వం లేకపోవడం.. నడిపించే నాయకుడి వైఫల్యం.. కలిసికట్టుగా ముందుకు సాగకపోవడంపై అధిష్టానం గుర్రుగా ఉంది. రాష్ట్రాన్ని వేరోచేతిలో పెట్టేలా ఇక్కడి నాయకత్వం వ్యవహరించిందని.. కనీసం ప్రతిపక్షంలో కూడా కనీస పోటీ ఇవ్వట్లేదని అర్థమైంది.

మొన్నటి దిగ్విజయ్ పర్యటనలో ఇది తేటతెల్లమైంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారిని అధ్యక్షుడిగా నియమించరాదన్న అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లు తెలియవచ్చింది. ఇఫ్పుడున్న ఎమ్మెల్యేలలో ఒకరిని నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. మొన్నటి డిగ్గీ పర్యటనలో అందరి సలహాలు తీసుకున్న తర్వాత ఓడిపోయన వారికీ పీసీసీ వద్దని.. గెలిచిన వారికే పీఠం కట్టబెట్టి టీఆర్ఎస్ పై పోరాడేందుకు సహకరించాలని ఇక్కడి నాయకులు కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *