Breaking News

పొన్నాల ఇది ట్రైలరే.. ముందుంది సినిమా.!

ktr-ponnala

హైదరాబాద్, ప్రతినిధి : పొన్నాల ఇది ట్రైలరే.. ముందుంది అసలు సినిమా అన్నారు మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ పాదయాత్రను ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో చేసిన పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని.. 5 ఏళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రతిపక్షాలకు అసలు సినిమా ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని కేటీఆర్ తెలిపారు.

రాజకీయ లబ్ధి కోసమే పొన్నాల పాదయాత్రలు చేస్తున్నారని.. కానీ మోకాళ్ల మీద నిడిచినా.. తలకిందులుగా యాత్ర చేసినా ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పొన్నాలకు ఇంకా చాలా యాత్రలు, ప్రయాసలు తప్పవన్నారు. సచివాలయాన్ని తరలించే విషయాన్ని ప్రతిపక్షాలు అనవసరపు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. పరిపాలన సౌలభ్యం కోసమే సచివాలయాన్ని తరలిస్తున్నామని తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సమర్థుడు కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *