Breaking News

పొన్నంపై జగదీశ్ రెడ్డి పరువునష్టం దావా

jagdeesh ponnam

నల్గొండ, ప్రతినిధి : మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన ‘5% కమీషన్’ వివాదం కోర్టు గడప తొక్కింది. మంత్రి జగదీశ్ రెడ్డి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై నల్గొండ జిల్లా సూర్యాపేట ప్రథమ శ్రేణి న్యాయస్థానంలో పరువునష్టం కేసు దాఖలు చేశారు. తాను పెండింగ్ బకాయిల చెల్లింపుల్లో 5% కమీషన్ తీసుకున్నానంటూ పొన్నం ఆరోపించాడని.. అది అన్ని పత్రికల్లో, టీవీల్లో వచ్చిందని.. నా పరువుకు భంగం కలిగించిన పొన్నం ప్రభాకర్ పై చర్య తీసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నిరాధార ఆరోపణల వల్ల మానసికంగా ఆవేదన కల్గిందని ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదును స్వీకరించిన న్యాయమూర్తి పరిశీలన అనంతరం దీనిపై చర్య తీసుకోనున్నట్లు తెలిపారు.

కాగా మంత్రి తనపై పరువు నష్టం దావా వేయడాన్ని ప్రజా కోర్టులో తేల్చుకుంటానని పొన్నం ప్రభాకర్ సవాలు విసిరారు. కరీంనగర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ ఒక వేదిక సూచించాలని.. అక్కడే తన ఆరోపణలకు రుజువు చేస్తానని పొన్నం చెప్పారు. జగదీశ్ రెడ్డి శాఖ ఎలా మారిందో ఇప్పుడైనా సమాధానం ఇవ్వాలని ప్రశ్నించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *