Breaking News

పొగడ్తలకు పొంగిపోకు.. విమర్శలను స్వీకరించు..

01-k-srinivas

-కేసీఆర్ పై సునిశిత విమర్శలు చేసిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే.శ్రీనివాస్
కరీంనగర్, ప్రతినిధి : తెలంగాణ తీసుకురావడంలో వచ్చిన పొగడ్తలు పొంగిపోయిన కేసీఆర్.. ఇప్పుడు పాలనలో తప్పటడుగులతో వస్తున్న విమర్శలకు కూడా బాధ్యత వహించాలని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఫిలింభవన్ లో జరిగిన కే శ్రీనివాస్ గారి పుస్తకాల పరిచయ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వచ్చాక కూడా రైతు ఆత్మహత్యలు జరిగాయని ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి చాలా బాధాకరమన్నారు. అనేక శక్తులు, వేదికలు, రచనలు, ఉద్యమాలు, పాటలు వల్ల తెలంగాణ వచ్చిందని.. కానీ కొందరు తమ వల్లే తెలంగాణ వచ్చిందని క్రెడిట్ కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే తెలంగాణ రాకముందే నుంచి తెలంగాణ ఉద్యమపరాపరాలను తన కవితల్లో రాశానని పేర్కొన్నారు. చరిత్రను సమన్వయ పరుచుకోవడానికి గతంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ వ్యాసాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *