
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన భారీ పథకాలకు కాసుల కొరత తీవ్రమైంది. దీంతో కాసుల కోసం విదేశాల బాట పట్టేందుకు సిద్దమైంది.. విదేశాల్లో ప్రత్యేక విభాగాలు, కార్యాలయాలు ఏర్పాటు చేసి తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వీటి నిర్వహణను ఉన్నతాధికారులు, నిపుణులకు బాధ్యతలు అప్పగించారు.
కాగా విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు కేంద్రం అనుమతి తప్పనిసరి.. ఇందుకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్లాన్ సక్సెస్ అయితే విదేశీ ప్రతినిధులు నేరుగా సీఎం కేసీఆర్ ను కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కారణంగా తెలంగాణకు డైరెక్టుగా పెట్టుబడులు వచ్చి అభివృద్ధి చెందుతుంది.