పైలెట్ చనిపోయాడు.. అయినా విమానం ల్యాండ్ అయ్యింది..

ఆదివారం రాత్రి 11.55 గంటలు అమెరికా ఎయిర్ లైన్స్ విమానం ఫోనిక్స్ నుంచి బోస్టన్ కు ప్రయాణికులతో బయలు దేరింది.. అయితే ప్రయాణం మధ్యలోనే పైలెట్ తీవ్ర అస్వస్తతో కుప్పకూలి క్యాబేన్ లోనే చనిపోయాడు. ఇది గమనించిన కోపైలెట్ ప్రయాణికులకు తెలపితే కంగారు పడతారని భావించి తానే విమాన బాధ్యతలు తీసుకున్నాడు. దాదాపు వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచే సికాస్ విమానాశ్రయ అధికారులతో మాట్లాడి.. పైలెట్ కుప్పకూలాడని అత్యవసర లాండింగ్ కు అనుమతికోరాడు. అంతేకాదు అంబులెన్స్ ను ఏర్పాటు చేయమన్నాడు..

దీంతో విమానాశ్రయ అధికారులు ల్యాండింగ్ కు అనుమతిచ్చారు. దీంతో కో పైలెట్ ఒక్కడే విమానాన్ని సురక్షితం గా దించాడు. అనంతరం ప్రయాణికులకు తెలపగా.. వారంతా కో పైలెట్ ను అభినందించారు. పైలెట్ను డాక్టర్లు పరీక్షించగా చనిపోయాడని నిర్ధారించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *