పేదోళ్ల కోసం కేసీఆర్ పెద్ద పథకం..

కేసీఆర్ తెలంగాణలో మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. పేదల కోసం రెండు పడక గదుల ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. సూర్యపేట, ఎర్రవల్లి, నర్సన్నపేటలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.. దీంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.. తెలంగాణతో పాటు దేశంలోనే ఇంతటి భారీ పథకాన్ని ఏ సర్కారు చేపట్టలేదు.. కేవలం ఐదున్నర నెలల్లోనే ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం గడువు విధించింది..

kcr2

ఎన్నికల వేళ కేసీఆర్ ఇచ్చిన హామీ ఇన్నాళ్లకు నెరవేరింది. ఈ సదాశయం కోసం ప్రభుత్వం భారీ కసరత్తు జరిగింది.. నియోజకవర్గానికి 400 ఇళ్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.. అర్హులైన పేదలకే ఈ ఇళ్లు కేటాయించేందుకు నిర్ణయించి అమలు చేస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ల నిర్మానానికి శంకుస్థాపన చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *