
కరీంనగర్, ప్రతినిధి : ఇందిర తర్వాత అఖండ మెజార్టీతో గెలుపొందిన బలమైన మోడీ కూడా పాకిస్తాన్ కవ్విస్తున్నా.. సంయమనం పాటిస్తున్నాడు..
హైదరాబాద్ కబ్జాకోరులపై అంకుశంలా లేచిన కేసీఆర్ సైతం పేదల కష్టాలు పాలు కాకూడదనే ఉద్దేశంతో స్థలాలు క్రమబ్దీకరిస్తున్నారు..
కరుడుగట్టిన ఈ మహానేతలు కరిగిపోయిన వేళ… కరీంనగర్ జిల్లాలో ఓ వికలాంగుడి ఇంటిని పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. కనీసం చెప్పకుండా పేకమేడలా కూల్చివేసింది.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకు ఎదుగురుగా ఓ వికలాంగుడు 1982 నుంచి చిన్న టీ కొట్టు పెట్టుకొని జీవిస్తున్నాడు. బ్యాంకు వచ్చిపోయే వారి పై ఆధారపడి చాయ్ పోసుకుంటూ సంపాదిస్తున్నాడు. రోడ్డుపై ఉందనే సాకుతో ఎలాంటి సమాచారం నోటీసులు ఇవ్వకుండా.. ఆకారణంగా కూల్చివేశారు చిగురుమామిడి పంచాయతీ పాలక వర్గం, సర్పంచ్. ప్రజాస్వామ్యం దేశంలో నిజాం వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారో ఏమో.. మరి ఆదేమైనా వారి జాగీరో తెలీదు కానీ.. ఇష్టమొచ్చినట్టు పేదవాడి గూడు చెరిపేసి వాడి పొట్టకొట్టారు. లక్షలు పన్నుల ఎగ్గొట్టినా స్పందించని పంచాయతీ.. భూములు కబ్జా చేసిన పట్టించుకోని సర్పంచ్ .. పేదవాడి గుడిసె కూలగొట్టడంలో మాత్రం ముందుండి నడిపించాడు. ప్రభుత్వాలే పేదలకు స్థలాలు క్రమబద్దీకరిస్తున్న వేళ.. ఇలా అప్రజాస్వామిక చర్యకు పాల్పడి రాక్షసానందాన్ని పొందారు. తమ గూడు పొగోట్టిన వారిపై చర్య తీసుకోవాలని రోడ్డేక్కిన బాధిత వికలాంగుడి రోదన అరణ్యరోధనే అయ్యింది.. స్పందించే హృదయాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు..