పేదవాడికి వరం డబుల్ బెడ్ రూం పథకం

కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): ఇండ్లు లేని పేదవాడికి ప్రభుత్వ డబుల్ బెడ్ రూం గృహ పథకం ఒక వరం లాంటిదని రాష్ర్ట పంచాయతీ రాజ్, ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. జిల్లాలోని ముస్తాబాద్, గంభీరావు పేటలలో డబుల్ బెడ్ రూం పథకానికి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ర్ట వ్యాప్తంగా మొదటి దశలో భాగంగా నియోజకవర్గానికి 400 ఇండ్లు, వచ్చే సంవత్సరానికి వేయి, మరుసటి సంవత్సరానికి రెండు వేల చొప్పున మరో నాలుగేండ్లలో ఎనిమిది వేల ఇండ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. గతంలో ఇండ్ల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుందని తప్పు చేసిన వారికి తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పండుతుందని అన్నారు. నిజమైన నిరుపేదలను గుర్తించి వారికే ఇండ్లు మంజూరు చేయాలని మంత్రి అన్నారు. కేవలం ఇండ్ల నిర్మాణాలే కాకుండా మౌళిక వసతులు కల్పించి మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *