పేదల కోసం 3 బీమా పథకాలు

కోల్ కత : పేదలకు బీమా ప్రయోజనం అందించే ప్రధానమంత్రి జీవన జ్యోతి, సురక్ష బీమా యోజనలను శనివారం కోల్ కతాలో ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లు ప్రారంభించారు. పేదలకు సాధికారత అందించే లక్ష్యంతో ప్రధాని 3 బీమా పథకాలను దేశ ప్రజల కోసం రూపొందించారు. దేశ వ్యాప్తంగా 80 నుంచి 90శాతం మంది కి బీమా యోజన లేదని.. ఈ మూడు పథకాలతో దేశ ప్రజలకు రక్షణ, బీమా దక్కుతుందన్నారు.

కాగా దేశ వ్యాప్తంగా 115 ప్రదేశాల్లో ఈ స్కీంను కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రారంభించారు.

ప్రధాన మంత్రి ప్రకటించిన బీమా పాలసీలు ఇవీ..

1. జీవన జ్యోతి బీమా పాలసీ : సంవత్సరానికి బ్యాంకు ద్వారా 330 చెల్లిస్తే ఏ కారణం చేతైనా మరణించిన ఆ కుటుంబానికి 2 లక్షలు దక్కుతాయి.

2.సురక్ష బీమా యోజన : సంవత్సరానికి 12 రూపాయలు బ్యాంకు ద్వారా చెల్లించాలి. ప్రమాదానికి గురైతే 2 లక్షల పరిహారం అందుతుంది.

3. అటల్ బీమా యోజన : వృద్దుల కోసం కోసం ఈ పథకం..  నెలకు కొంత మొత్తం చెల్లిస్తే 50 ఏళ్ల అనంతరం వారికి చెల్లించిన మొత్తాన్ని బట్టి 1000 నుంచి 5000 వరకు ప్రయోజనం దక్కుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *