పేదల కోసం మోడీ ‘ముద్రా’ బ్యాంకు

ఢిల్లీ : రిజర్వ్ బ్యాంకు, బ్యాంకుల కబంధ హస్తల్లో చిక్కి శల్యమవుతున్న రైతుల దీనగాథకు శుభం పలికేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఒక గొప్ప కార్యాచరణకు ప్రాణం పోశారు. ఇన్నాళ్లు.. ప్రభుత్వాలు రైతులకు రుణాలివ్వాలని బ్యాంకులను కోరడం అవి పెడచెవిన పెట్టడం.. రుణాలు అందక రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం ఇలా భారతంలో జరుగుతూనే ఉండేది. దీనిపై కేంద్ర ప్రభుత్వాలు బ్యాంకులకు ఎన్ని విన్నపాలు చేసినా అవి పెడచెవిన పెట్టేవి. కార్పొరేట్ వ్యక్తులకు, పెద్ద కంపెనీలకు బ్యాంకులు కోట్లలో రుణాలిచ్చి.. యువతకు, రైతులకు మాత్రం అడ్డగోలు నిబంధనలతో రుణాలు ఎగ్గొట్టేవి. వీటన్నింటి వల్లే దేశం ఎదగలేకపోతుందని మోడీ భావించారు.

దీంతో ప్రధాని ఆలోచనల్లోంచి పుట్టిన గొప్ప ఆలోచనే ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ముద్ర బ్యాంకు’. 20 వేల కోట్ల మూలధనంతో ప్రధాని నరేంద్ర ఈ బ్యాంకు ఢిల్లీలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. దీని ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ప్రభుత్వం ముద్ర బ్యాంకు ద్వారా రుణాలందిస్తుంది. 5.77 కోట్ల యూనిట్లకు లబ్ధి కలుగనుంది. ఆకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ముద్ర బ్యాంకు ఆదుకుంటుంది. దీనివల్ల రిజర్వు బ్యాంకు, బ్యాంకులకు నరేంద్ర మోడీ చెక్ పెట్టారనే అనొచ్చు. యువత, రైతులకు రుణాల లభ్యత పెరిగి దేశం ఆర్థికాభివృద్ది చెందుతుందని ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *