
పేదలు లేని దేశంగా భారతదేశాన్ని చూడాలన్నదే బీజేపీ అభిమతమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. బిట్స్ పిలానీలో జరిగిన కార్యక్రమంలో మురళీధర్ పాల్గొని ప్రసంగించారు. భారత దేశాన్ని ప్రపంచ శక్తిగా ఎలా తయారు చేయాలనే విషయంపైన మాట్లాడారు. 17వ శతాబ్దంలో భారతదేశం ప్రపంచ శక్తిగా ఉండేదని.. ప్రపంచ జీడీపీ లో భారతదేశం యొక్క వాటా 27% ఉండేదన్నారు. బ్రిటిష్ వలస పాలకుల ద్వంద్వ విధానాలు వలన భారత దేశ ఆర్ధిక వ్యవస్థ ఎన్నో ఆటుపోట్లకు గురిచేశాయన్నారు.
మన దేశం యోక్క శాస్త్ర సాంకేతిక విద్య సంస్థలో అగ్రగామి ఉందన్నారు. బిట్స్-పిలాని సంస్థ నుండి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉద్భవించారన్నారు. భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అన్ని నిజ జీవిత సమస్యలపైన మనం ఎంతో పరిశోధనలు చేయాలని ఆయన సూచించారు. .బిట్స్-పిలాని విద్యార్దులు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇన్కుబేషన్ అండ్ ఎంటర్ప్రీనుఎర్షిప్ (CIIE) ద్వారా ఎన్నో శాస్త్ర సాంకేతిక సంస్థలు స్థాపించి భారత దేశాన్ని ప్రపంచ శక్తిగా తయారు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారని.. ఇది ఎంతో గర్వకారణమన్నారు..
రక్షణ పరికర తయారీ , స్పేస్ టెక్నాలజీ మరియు కొత్త శాస్త్ర సాంకేతిక విషయముల పైన పరిశోధనలు ఎంతో అవసరమన్నారు..ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో భారతదేశం శాశ్వత సభ్యత్వం కోసం ఎంతో కృషి చేయాలన్నారు. భారతదేశ చిత్ర పరిశ్రమ 22 భాషలో ఏడాదికి 1000 పైగా చిత్ర నిర్మిస్తూ హాలీవుడ్ కు పోటిగా నిలబడుతోందన్నారు.
ఈ కార్యక్రమం లో బిట్స్-పిలాని ఉపకులపతి ఆచార్య వి.ఎస్. రావు స్వాగాతోపన్యాసం చేశారు. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రొగ్రమ్మెస్ (WILP) డివిజన్ డైరెక్టర్ ఆచార్య ఎస్.సుందర్ , సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇన్కుబేషన్ అండ్ ఎంటర్ప్రీనుఎర్షిప్ (CIIE) ఫాకల్టీ ఇన్ చార్జి సహాయక ఆచార్యులు, టెక్నాలజీ బిజినెస్ ఇంకుబీటార్ మేనేజినింగ్ డైరెక్టర్ సూర్య రావు, వివిధ విభాగముల ఆచార్యులు , బోధనేతర సిబ్బంది, లోకనీతి చర్చ వేదిక కార్యనిర్వహకులు సత్యేంద్ర త్రిపాఠి, యమ్మాని వెంకట్ సుబ్బారావు, పెద్ద సంఖ్యలో యువ పారిశ్రామికవేత్తలు, బిట్స్-పిలాని విద్యార్దులు మరియు ప్రజలు పాల్గొన్నారు.