
హైదరాబాద్ : తెలంగాణను పేదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మల్కాజిగిరిలో పేదలకు భూమి పట్టాల పంపిణీ చేశారు. అనంతరం సభలో మాట్లాడారు. పేదలకు భూమి పట్టాలు పంచడం తన జీవితంలో ఎంతో సంతోషకమన్నారు. జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్న పేదలకు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఒక్కరోజే లక్షా 25 వేల మంది భూమి పట్టాలు పంపిణీ చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేన్నారు. హైదరాబాద్ లోనే లక్ష పట్టాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వీటి విలువ పదివేల కోట్లు అని వెల్లడించారు.