పేదలకు పెద్ద ఆసరా సిఎం రిలీఫ్ ఫండ్: మంత్రి తలసాని శ్రీనివాస్

పేదలకు పెద్ద ఆసరా సిఎం రిలీఫ్ ఫండ్: మంత్రి తలసాని శ్రీనివాస్

ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సరైన వైద్యం పొందలేకపోతున్న పేదప్రజలను ముఖ్యమంత్రి సహయనిధి ఎంతో ఆదుకుంటుందని రాష్ట్ర్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్  చెప్పారు. శుక్రువారం మారేడ్ పల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహయనిధినుండి మంజూరైన 9లక్షల రూపాయల ఎల్ఓసి (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను ఇద్దరు లబ్ధిదారులను అందజేశారు. బన్సీలాల్ పేటకు చెందిన సుదర్శన్ క్యాన్సర్ వ్యాధితో  బాధపడుతుండగా, మెరుగైన చికిత్సకోసం మంత్రి శ్రీనివాసయాదవ్ చొరవతో 7లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహయనిధినుండి మంజూరైనది. అదేవిధంగా మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మూనిక తెల్లరక్త కణాల సంఖ్య పడిపోయి అనారోగ్యానికి  గురికాగా చికిత్స నిమిత్తం 2లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహయనిధినుండి మంజూరైనది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *