పేదలకు నాణ్యమైన విద్యను అందించడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

కరీంనగర్: పేదలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర్ర ఆర్ధిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం అల్గునూరు వద్ద టి.ఎస్.డబ్ల్యు, రెసిడెన్సియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సి పాఠశాలలో విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ పేద ప్రజలకు కార్పోరేట్ స్ధాయిలో విద్యను అందించే లక్ష్యంతో 250 ఆశ్రమ పాఠశాలలో ఒకేసారి ప్రారంభించిన రాష్ట్ర్రం తెలంగాణ రాష్ట్ర్రం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. సమాజంలోని అసమానతలు తొలగడానికి విద్య ఒక్కటే మార్గమని గుర్తించిన నాయకులు జ్యోతిబాపూలే, అంబేడ్కర్ అని అన్నారు. కడు పేదరికంలో ఉన్నప్పటికి కష్టపడి చదివి, మనకు భారత రాజ్యాంగాన్ని అందించిన మహనుభావుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అని అన్నారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కొరకే పాటుపడాలని అన్నారు. అందులో భాగంగానే సాంఘీక, సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధులను ఇంజనీర్లను, డాక్లర్లుగా తయారు చేయడమే కాకుండా వారు సమాజంలో ఆదర్శవంతంగా జీవించడానికి దోహదపడుతున్నారని అన్నారు. అనంతరం హరితహరం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, మానకొండూరు ఎమ్మెల్యే, సాంస్కృతిక శారది రసమయి బాలకిషన్ టిఆర్ఎస్ నియోజక వర్గ ఇంచార్జీ ఈద శంకర్ రెడ్డి, ఎంపిపి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

eatela

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *