
వాషింగ్టన్ (పిఎఫ్ ప్రతినిధి): ఇండియాలో పేదరికం చాలా తగ్గందని అయితే పేద ప్రజలే ఎక్కువగా ఉన్నారని ప్రపంచ బ్యాంకు ఉద్ఘాటించింది. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం భారత్ లో పేదరికం చాలా వరకు తగ్గుతుందని 2015 జనాభాలో పేదరికం 10 శాతం తగ్గిందని తెలిపింది. 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించేందుకు భారత్ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపింది. అయితే 2012లోఅల్పాదాయ దేశంగా ఉన్న చైనా, భారత్, ఇండోనేషియా వంటి దేశాలు 2015లో మధ్యాదాయ దేశాల జాబితాలో చేరాయని వెల్లడించింది.