పేటెంట్ల కోసం కొట్టుకుంటున్న యాపిల్, సాంసంగ్

AppleSamsungRuling-300

యాపిల్, సాంసంగ్.. ఈ  రెండు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలే.. రెండు దేని కదే సాటి.. కానీ  ప్రపంచ మొబైల్ టెక్నాలజీలో ప్రస్తుతం యాపిల్ హవా నడుస్తోంది. యాపిల్ తయారు చేసే ప్రతి సాఫ్ట్ వేర్, యాప్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకమే.. ఇప్పుడు ఈ టెక్నాలజీ చిచ్చు యాపిల్, సాంసంగ్ ల మధ్య చిచ్చు రేపింది.. యాపిల్ తయారు చేసిన యాప్ప్ ను శాంసంగ్ కాపీ కొట్టిందని యాపిల్ క్విక్ లింక్స్ పేటేంట్ హక్కులను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పిటీషన్ దాఖలు చేసింది.  అమెరికాలోని ఫెడరల్ కోర్టు లో విచారణ జరిగింది..  ఆ పేటెంట్ హక్కులను ఉల్లంఘనలకు పాల్పడిందని పిటీషన్ వేసిన యాపిల్  సంస్థకు కోర్టు ఎదురుదెబ్బ తగిలింది..కోర్టులో యాపిల్ సాఫ్ట్ వేర్లను సాంసంగ్ కాపీ కొట్టలేదని.. వేరే తయారు చేసిన యాప్ప్ ను యాపిల్ కు హక్కు లేదని నిర్ధారించిన కోర్టు సాంసంగ్ కు మద్దతిచ్చింది.. దీంతో 825 కోట్ల రూపాయల కోసం యాపిల్ వేసిన పిటీషన్ కొట్టివేయబడింది..

కాగా 2015 డిసెంబర్ లో కూడా యాపిల్ సంస్థ.. సాంసంగ్ పై మరో యాప్ విషయంలో యాపిల్ దావా వేసింది. దీనిపై కోర్టు అప్పట్లో దాదాపు 3770 కోట్ల రూపాయల ఫైన్ వేయడంతో సాంసంగ్ చచ్చినట్టు ఆ పరిహారాన్ని యాపిల్ కు చెల్లించింది. కానీ ఇప్పుడు సాంసంగ్ కు ఊరట లభించడం విశేషం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *