
*పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడి…10 మంది అరెస్ట్..39,600/- స్వాధీనం..*
మానకొండూరు మండలంలోని పచ్చునూర్ నుంచి వేగురుపల్లి వెళ్లే దారిలో ఉన్న మామిడి తోటలోని ఫామ్ హౌస్ లో పేకాట అడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ దాడి చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. 39,600 రూపాయలు స్వాధీనంచేసుకున్నారు. పేకాట ఆడుతున్న వేగురుపల్లి కి చెందిన మాజీ ఎంపిపి ముద్దసాని శ్రీనివాస రెడ్డి , పబ్బతి విజేందర్ రెడ్డి, ఇట్టవేని తిరుపతి, వేగురు పల్లి సర్పంచ్ ముద్దసాని శ్రీధర్ రెడ్డి , మనకొండూర్ కు చెందిన బత్తిని నర్సయ్య, కొండపల్కల కు చెందిన మార్కెట్ కమిటి వైస్ చైర్మెన్ తిరుపతి రెడ్డి , సుల్తానాబాద్ కు చెందిన బురుగు రవీందర్, ముంజంపల్లి కి చెందిన బత్తిని మల్లయ్య, కనగర్తి కి చెందిన రావుల స్వామి గౌడ్, కరీంనగర్ కు చెందిన వైస్ ఎంపిపి సంతోష్ రెడ్డి లను పట్టుకొని వారి వద్ద నుంచి 39,600/- రూపాయల నగదును స్వాధీనం చేసుకొని,మనకొండూరు పోలీసులకు అప్పగించగా కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనివాసరావు, ఎస్సైలు కిరణ్,సంతోష్,నాగరాజు పాల్గొన్నారు.