
పాకిస్తాన్ లోని ముల్తాన్ లో ఘోరంగా జరిగింది. మామూలుగా పెళ్లి కి నిరాకరించిందని ఆడవారిపై యాసిడ్ దాడులు చూస్తాం.. కానీ పాకిస్తాన్ లో ఓ మహిళే తనను వాడుకొని మోసం చేశాడని సాదక్త్ అలీ అనే వ్యక్తిపై యాసిడ్ దాడి చేసింది. ఈ దాడిలో అతడి శరీరం 50శాతం ఖాళీపోయిందట.. దీంతో అతడు ప్రాణాప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు..
మోమెల్ అనే మహిళ అలీ మాయలో పడి భర్తకు విడాకులు ఇచ్చి అలీతో కలిసి సహజీవనం చేస్తోందట.. కాగా పెళ్లి చేసుకోమ్మని ఇంటికి వెళ్లి అడుగగా అలీ నిరాకరించడంతో యాసిడ్ తీసుకొచ్చి అలీపై పోసింది. దీంతో అతడు సగం వరకు శరీరం కాలిన గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.