Breaking News

పెద్దాయన సందు చూసి మోడీని కొట్టాడు..

Narendra-modi-LK-advani-295x200

అసలు మోడీ ప్రధాని కావడమే ఆయనకు ఇష్టం లేదు.. బీజేపీలో రెండో మూల స్తంభమైన అడ్వాణీ జీకి ప్రధాని అయ్యే సత్తా ఉన్న అధికారంలో తీసుకురాలేడని పక్కకు తప్పించారు. సీనియర్ అని కనీసం ఏ పదవి కూడా ఇవ్వలేదు.. బీజేపీ అధికారంలో ఉన్నా ఆయన కురవృద్దుడి వలే బీజేపీ-మోడీ పాలనను మౌనంగా చూస్తున్నారు. కానీ ఇప్పుడు సందు చూసి మోడీపై అటాక్ కు దిగాడు. సీనియర్లను గ్రూపుగా మలిచి మోడీపై బహిరంగంగా లేఖ రాసి కాంట్రవర్సీని సృష్టించాడు. ఇప్పుడు బీజేపీని ఇది ఇరుకున పెట్టగా.. మోడీపై అడ్వానీ, సీనియర్ల విమర్శలు ప్రతిపక్షాలకు బూస్ట్ నిచ్చాయి..

నరేంద్రమోడీ ఏకస్వామ్య పాలన చేస్తున్నాడని.. అందరి అభిప్రాయాలు గుర్తించకుండా సొంత నిర్నయాలు తీసుకుంటూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని అడ్వానీ సీనియర్ల ఆరోపణ.. దాని ఫలితమే ఢిల్లీ, బిహార్ లలో బీజేపీ ఓటమి అని బీజేపీ సీనియర్లు ధ్వజమెత్తారు. మోడీ పై విరుచుకుపడ్డారు. ఇలాగే కొనసాగితే దేశంలో బీజేపీ పని ఖతం అయ్యి మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంటుందని అడ్వాణి ప్రశ్నల లేఖ కురిపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *