‘పెద్దలు జానారెడ్డి’ గారు..

తెలంగాణ అసెంబ్లీ కేసీఆర్ తరచుగా అనే మాట..‘పెద్దలు జానారెడ్డిగారు’.. ఈ డైలాగులు ఉబ్బితబ్బియిపోయేవారు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి.  ఆయన వ్యవహార శైలి కూడా అధికార టీఆర్ఎస్ పక్షానికి అనుకూలంగా ఉందంటూ స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఆరోపించిన సంగతి తెలిసిందే.. అయితే ఆయన అధికార పక్షంపై ప్రేమను మరో సారి గుర్తు తెచ్చుకున్నారు.

నిన్న హైదరాబాద్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నేతలంతా హాజరై సమాలోచనలు చేశారు. అనంతరం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దలు జానారెడ్డిగారు మాట్లాడారు.

‘నల్గొండ జిల్లాలో ఇద్దరు దొంగలను అరికట్టడంలో మా ప్రభుత్వం బాగా పనిచేసిందని.. మా పోలీసులు ప్రాణాలకు తెగించి పోరాడి ఉగ్రవాదులను చంపేశారు. ఈ విషయంలో మా టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా పనిచేసిందని’ అన్నారు. ఇలా అనగానే పక్కనే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు జానారెడ్డి గారు.. మనది కాంగ్రెస్ .. టీఆర్ఎస్ ప్రభుత్వం కాదని సూచించారు. దీంతో నాలుక కరుచుకున్న జానారెడ్డి కాసేపు చిటుక్కున నవ్వుకున్నారు. మొత్తానికి జానారెడ్డి మాటలు విన్న కాంగ్రెస్ నాయకులు ఈయన వచ్చే ఎన్నికల్లోపు టీఆర్ఎస్ లో చేరడం ఖాయం అని గుసగుసలాడుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *