పెద్దపల్లి లో చేతి ధర్మయ్య సుడిగాలి పర్యటన

పెద్దపెల్లి శాసన సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశీస్తున్న చేతి ధర్మయ్య నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు గా పనిచేసిన చేతి ధర్మయ్య 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించాలనే తపనతో ఉన్నారు. పెద్దపెల్లి శాసన సభ నియోజకవర్గ పరిధిలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్ద రాతి పల్లి ఆయన స్వగ్రామం .కనకమ్మ రాజయ్య అనే దంపతులకు 1955 మే 6వ తేదీన ధర్మయ్య జన్మించారు .హైస్కూలు విద్య కాల్వ శ్రీరాంపూర్ లో చదువుకున్నారు. డిగ్రీ మంచిర్యాల్ లో చదివారు. 1995లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు .జెడ్ పి టి సి సభ్యులు గా పోటీ చేయాలని ఆయన ఆశించారు .కానీ ఆయనకు టిక్కెట్ దక్కలేదు .ఆయన 1995లో పెద్ద రాతి పల్లి సర్పంచ్ గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. సర్పంచిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామస్తుల అభిమానాన్ని చూరగొన్నారు. 2003 సంవత్సరంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008లో రెండవసారి ,2012లో మూడవసారి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా గెలిచారు .2010 సంవత్సరంలో ఫిషరీస్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ గా ఎన్నికయ్యారు .2010 నుండి 2017 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2019 శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. బలహీన వర్గాలకు చెందిన తనకు కాంగ్రెస్ పార్టీ తప్పక ticket ఇస్తుందనే ఆశతో ఉన్నారు. పెద్దపెల్లి శాసన సభ నియోజకవర్గంలో 65 శాతం ఓట్లు బిసి ఉండటంతో వారి ఓట్లపై ఆయన పూర్తి ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో 230000 ఓట్లు ఉండగా, ఒక లక్షా అరవై ఐదు వేల ఓట్లు బిసి ఓట్లు ఉన్నాయి. పెద్దపెల్లి నియోజకవర్గంలో 55 వేల ఓట్లు మత్స్యకారుల కుటుంబాలకు చెందినవే కావడం ధర్మయ్యకు కలిసివచ్చే అంశం. పెద్దపల్లి నియోజకవర్గంలో 80 ఫిషరీస్ సొసైటీలో ఉన్నాయి 25 నుంచి 30 గ్రామాల్లో మెజార్టీ కుటుంబాలు మత్స్యకారుల వే కావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం కూడా చేతి ధర్మయ్యను రంగంలోకి దించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో పెద్దపెల్లి శాసనసభ నియోజకవర్గం నుండి చేతి ధర్మయ్య కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ప్రయత్నించారు .కానీ అప్పుడు ఆయనకు అవకాశం దక్కలేదు. ఈసారి మాత్రం నూటికి నూరుశాతం పార్టీ టికెట్ రావడం గ్యారంటీ, ఘన విజయం సాధించడం గ్యారెంటీ అనే ధీమాతో చేతి ధర్మయ్య ఉన్నారు .పెద్దపెల్లి నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ ,ఓదెల, పెద్దపల్లి, సుల్తానాబాద్ ,ఎలిగేడు, జూలపల్లి మండలాల్లో చేతి ధర్మయ్య సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక్కడ ఈయన నమ్ముకున్న బీసీ కార్డు ఏమేరకు పని చేస్తుందో వేచి చూడాల్సిందే.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *