పెద్దపల్లి ఎమ్మెల్యేకే రూ.3కోట్ల అప్పు ఇచ్చాడట..

ఏఎస్సై మోహన్ రెడ్డి.. కరీంనగర్ సీఐడీలో పనిచేస్తూ పోలీసుల నుంచి కోట్ల రూపాయలు సేకరించి వడ్డీలకు తిప్పేవాడు.. అతడి అక్రమ ఫైనాన్స్ వ్యాపారికి కరీంనగర్ ఏఎస్సీ జనార్దన్ రెడ్డి, డీఎస్పీ, సీఐ, ఎస్సైలు కోట్ల రూపాయలు ఇచ్చి వ్యాపారాన్ని ప్రోత్సహించారు. రికవరీల్లో బాధితులను తీవ్రం గా బెదిరించి మోహన్ రెడ్డి చాలా మంది ఆస్తులను కొల్లగొట్టాడు.. ఓ విద్యాసంస్థ వ్యాపారికి కూడా 90 లక్షల వరకు అప్పు ఇచ్చి ఆయనను బెదిరించడంతో సూసైడ్ చేసుకున్నాడు. విద్యాసంస్థ యాజమాని బార్య ఫిర్యాదుతో మోహన్ రెడ్డి అక్రమాలు వెలుగుచూశాయి..

00000123

పెద్దపల్లి ఎమ్మెల్యే కూడా 2014 ఎన్నికల సమయానికి 3 కోట్ల అప్పు ఇచ్చినట్టు మోహన్ రెడ్డి పోలీసుల విచారణ లో వెల్లడించాడు. అంతేకాదు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సైతం మోహన్ రెడ్డి  అప్పు ఇచ్చినట్టు విచారణలో వెల్లడించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వడ్డీతో కలిపి 3 కోట్లకు గాను రూ.4.80 కోట్లు చెల్లించాడట..

ఇప్పుడీ వ్యవహారం కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపుతోంది. మోహన్ రెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తగా.. పోలీసు శాఖలో, రాజకీయ నాయకుల్లో ఫైనాన్స్ దందా గుబులు రేపుతోంది. ఎవరికి చిక్కు తెచ్చిపెడుతుందోనని భయపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *