Breaking News

పెద్దనాన్నకు ప్రేమతో..-ప్రభాస్

8x4108

రెబల్ కృష్ణం రాజు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా ఆయన వారసుడు అయిన ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు వద్దకు వచ్చి అన్నాడట.. మీకు సన్మానం చేద్దామని. కానీ గామా అవార్డ్స్ లో కృష్ణంరాజుకు లైఫ్ టైమ్ ఆవార్డు రావడంతో సన్మానం అక్కడే ఏర్పాటు చేశాడు ప్రభాస్. దుబయ్ లో అందరి సమక్షంలో ఈ వేడుక జరిగింది. గామా అవార్డ్స్ లో బాహుబలికి అవార్డులు వచ్చాయి.. చిత్ర బృందంతోపాటు దేవీ శ్రీకి కూడా అవార్డ్స్ వచ్చాయి. ఈ సందర్భంగా కృష్ణంరాజు తనకు అవార్డు, 50 ఏళ్ల ప్రస్థానం, బాహుబలి సినిమా గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా తమన్న, దేవీశ్రీ డ్యాన్స్ లతో అలరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *