
న్యూఢిల్లీ , ప్రతినిధి : నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టిన వేళా విశేషం ఏంటో అన్ని కలిసి వస్తున్నాయి.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గడంతో ఇండియన్ ఎకానమీకి గొప్ప ఊరట లభించింది. ఆర్థికాభివృద్దిలో వేగం పెరిగింది. ఇందంతా నరేంద్ర మోడీ మాయ అని బీజేపీ నేతలు పేర్కొంటున్నా.. అంతర్జాతీయ పరిణామాలు కలిసి వచ్చాయని చెప్పొచ్చు..
ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గడంతో ప్రభుత్వం పెట్రోల్..డీజీల్ ధరలు మళ్లీ తగ్గించింది. లీటర్ పెట్రోల్ కు రూ.2.42పైసలు..లీటర్ డీజీల్ కు రూ.2.25 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు అర్థరాత్రి నుండి అమల్లోకి రానున్నాయి. సంవత్సరం కిందట 80 రూపాయలకు ఎగబాకిన పెట్రోల్ ధర 60 రూపాయల లోపు పడిపోవడంపై నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.