
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి చైనా వెళ్లిన కేసీఆర్ అక్కడ పారిశ్రామిక వేత్తలతో విస్తృతంగా చర్చలు జరిగి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పించారు. చైనా, హంకాంగ్ సహా డాలియన్, షాంగై తదితర చోట్ల పెట్టుబడుదారులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. తమ రాష్ట్రంలో భారీగా ల్యాండ్ బ్యాంక్, సరళీకరణ అనుమతులు ఇస్తామని వెంటనే తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.