పెండ్లి రోజే కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తాం:ఈటెల

కరీంనగర్: కుల మతాలతో సంబందం లేకుండా పేదల కుటుంబాలలో జరుగు వివాహాలకు 10 రోజుల ముందు ధరఖాస్తు చేసుకున్న వారికి పెండ్లి రోజే కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులు అందజేస్తామని రాష్ట్ర్ర ఆర్ధిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం జమ్మికుంట మండల కేంద్రంలోని ఎం.పి.ఆర్ గార్డెన్స్ లో హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలలో మంజూరు అయిన కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను మంత్రి లబ్దిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో 241 మందికి 1,28,91,000/- రూపాయల చెక్కులను పంపిణి చేస్తున్నామని, పెండింగ్ లో ఉన్న 200 మందికి వారం రోజుల్లో పంపిణి చేస్తామని తెలిపారు. పేద కుటుంబాలలో ఆడ పిల్లల పెండ్లిలు చేసి తిప్పల పాలు కాకుండా కాపాడుటకు కులాలు మతాలతో సంబందం లేకుండా పేదవారందరికి కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పధకాల క్రింద 51 వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఒక్క రూపాయి లంచం లేకుండా ఈ పధకాన్ని పకడ్బందిగా అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే మార్చి నుండి పెండ్లి రోజునే 51 వేల చెక్కు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇల్లందకుంట దేవస్ధానంలో పెద్ద పెద్ద షెడ్లు నిర్మించామని, హుజురాబాద్ నియోజక వర్గంలోని పేదవారందరు వివాహలకు ధరఖాస్తు చేసుకుంటే ఆయన స్వంత ఖర్చుతో సకల సౌకర్యాలతో మంగళ సూత్రాలు, మట్టెలు, అందరికి భోజనాలు ఏర్పాటు చేసి ఘనంగా వివాహలు జరిపిస్తాయని తెలిపారు. వెంటనే సంబందిత తహసీల్ధార్లకు ధరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. పేద వారి వైద్యానికి ఆరోగ్య శ్రీ, ముఖ్యమంత్రి సహయనిధి ధ్వారా ఆదుకుంటున్నామని, ఏది లేని వారికి తాను స్వంతంగా ఆదుకుంటానని, నేను మీ కుటుంబంలో ఒక సభ్యున్ని అని అన్నారు. పేదవారి పిల్లల చదువులకు అప్పుల పాలు కావద్దని, నియోజక వర్గానికి ప్రభుత్వం 10 గురుకుల పాఠశాలలు మంజూరు చేసిందని తెలిపారు. పేదల కష్టాలు, ఇబ్బందులు తొలగిస్తామని పాత పద్దతికి స్వస్తి చెప్తామని, కొత్త పద్దతికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి.శ్రీనివాస్, డిఆర్ఓ ఆయేషా మస్రత్ ఖానం, నగర పంచాయితి చైర్మన్ రామస్వామి, ఎఎమ్ సి చైర్మన్ రమేష్, నియోజక వర్గంలోని ఎమ్ పిపి లు, జెడ్పిటిసి లు సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *