పూరీ ఒడ్డున కేటీఆర్….

దక్షిణాది రాష్ర్టాల్లో ఇప్పటివరకు ఏవరికీ దక్కని అరుదైన గౌరవం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు దక్కింది. పూరీ సాగర తీరంలో మంత్రి కేటీఆర్ భారీ సైకత శిల్పం వెలిసింది. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పూరీ బీచ్‌లో ప్రముఖ సైకత శిల్పకారుడు, ప్రైడ్ ఆఫ్ ఒడిశా అవార్డు గ్రహీత మనస్‌కుమార్ ఈ భారీ శిల్పాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పంలో తలపాగా కట్టిన కేటీఆర్ బొమ్మతోపాటు తెలంగాణ చిత్రపటం కూడా ఉండడం విశేషం. కేటీఆర్ సాధించిన విజయాలకు గుర్తుగా యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, టీ హబ్ లోగోలు, కేటీఆర్ సొంతం చేసుకొన్న స్కాచ్ చాలెంజర్ అవార్డును ఈ సైకత శిల్పంలో పేర్కొనడం గమనార్హం. పూరీ బీచ్‌లో సైకత శిల్పం ఏర్పాటు చేసిన తొలి దక్షిణాది నేత కేటీఆర్ ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తర్వాత ఈ గౌరవాన్ని మంత్రి కేటీఆర్ దక్కించుకున్నారు. గ్రేటర్ టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు పీ జగన్మోహన్‌రావు పర్యవేక్షణలో రూపుదిద్దుకొన్న శిల్పం కోసం 8 మంది కళాకారులు 40 గంటల పాటు శ్రమించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *