పూరి ఇంట్లో భారీ దొంగతనం

Puri-Jagannadh-Launches-RK-Media-House

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట్లో దొంగలు పడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెం 31లో పూరి జగన్నాథ్ నివాసం ఉంటున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులు పనినిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు  ఇంట్లోకి చొరబడి బెడ్ రూమ్ లో ఉన్న అలమారాలోని బంగారు ఆభరణాలు, నక్సెస్ , విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. ఇంటికి వచ్చిన పూరి తలుపులు తెరిచి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగతనం వెలుగుచూసింది. దాదాపు 15 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, వజ్రాల నెక్లెస్ చోరీకి గురయ్యాయని పూరి జగన్నాథ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *