పూరితోనే వరుణ్ రెండో సినిమా..!

మెగా బ్రదర్ నాగ బాబు కొడుకు వరుణ్ తేజ మొదటి సినిమా పూరి జగన్నాథ్ తో చెయ్యాల్సింది. కానీ అనుకొని కారణాలవల్ల ఆ చాన్స్ శ్రీకాంత్ అడ్డాలకి దొరికింది. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘ముకుంద’గా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు వరుణ్ తేజ. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఈ సినిమా తరువాత వరుణ్ తేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన కథ కూడా సిద్దంగా వుందట. ‘హార్ట్ ఎటాక్’ సినిమా చేసిన తరువాత విరామం తీసుకున్న పూరి ఆ గ్యాప్ లో ఈ కథని రాసాడంట. ఈ కథకి మెగా ఫ్యామిలీ తో పాటు వరుణ్ తేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.