Breaking News

పుష్కర ఊపు పథకాలకు కొనసాగితే..

773664768kcr-on-harita-haram-starts

పుష్కరాలకు తెలంగాణ వ్యాప్తంగా జనం పోటెత్తారు. దాదాపు 6 కోట్ల మంది తెలంగాణ పుష్కర ఘాట్లలో స్నానాలాచరించారు. ఎవరు పిలవకపోయినా పిల్ల జల్లా.. ముసలి ముతక అందరూ గోదావరి తీరం బాట పట్టారు. ప్రతీ కుటుంబం కనీసం 5 వేల రూపాయాలు ఖర్చు పెట్టుకొని పుష్కరస్నానం చేశారు. ఇంతలా అవగాహన గతంలో ఎప్పుడు రాలేదు.. గత పుష్కరాల సమయంలో జనం ఇంతలా రాలేదు.. ప్రభుత్వం అవగాహన, మీడియా పాత్ర ఇందులో కీలకంగా నిలిచాయి..

ఇదే ఊపు పథకాల్లో కొనసాగితే..

పుష్కరాలకు జనం ఎలాగైతే తరలివచ్చారో అలాగే.. అలాగే ప్రభుత్వ పథకాల్లో కూడా భాగస్వాములైతే తెలంగాణ బంగారు తెలంగాణ కావడానికి సమయం చాలా దగ్గర్లోనే ఉంటుంది.. కేసీఆర్ కళలు కన్నా బంగారు స్వప్నానికి పుష్కరాల వలే జనం విజయవంతం చేయగలిగితే ఇక మనకు తిరుగుండదు.. కుట్రలు కుత్రంత్రాలకు కాలం చెల్లిన తెలంగాణ నేల ఇఫ్పుడు.. స్వాభిమానం.. స్వతంత్రతో ముందడుగేస్తోంది.. మంత్రులు, సీఎం, అధికారులు, జనం సేవ చేసిన వేళ.. కొత్త చరిత్ర తెలంగాణలో లిఖితమైంది.. పుష్కరాల వలే ప్రతీ కుటుంబం ఇంటికో చెట్టు నాటితే కాదా తెలంగాణ హరిత వనం.. ఈ ఊపు కొనసాగించండి.. జనం మమేకమవ్వండి.. సాగిపో.. తెలంగాణ ఇలానే ముందుకు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *