పుష్కరాలు సూపర్ సక్సెస్: ఈటెల

పుష్కరాలు సూపర్ సక్సెస్

తెలంగాణలో ప్రజలు పుష్కరాలను  సూపర్ సక్సెస్ చేశారని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంతోషం వ్యక్తంచేశారు. ధర్మపురిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుగునంగా పనిచేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహా పుష్కరాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆరు నెలలుగా 600 కోట్ల రూపాయలతో పుష్కర ఏర్పాట్లు చేసినట్లు ఈటెల రాజేందర్ చెప్పారు. కోట్లాది మంది భక్తుల ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. విలేకరుల సమావేశంలో ప్రభుత్వ ప్రధాన విప్ కొప్పుల ఈశ్వర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నీతు కుమారి, ఎస్పీ జోయల్ డేవిస్, అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, అదనపు జేసీ నాగేంద్ర, జగిత్యాల సబ్ కలెక్టర్ క్రిష్ణ భాన్కర్, డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

DSC_0247 PSR_4984

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *