పుష్కరాలకు బాబ్లీ నీళ్లు..

జూలై 14 నుంచి జరగనున్న పుష్కరాలకు ఉత్తర తెలంగాణలోని బాసర, ధర్మపురి వద్ద చుక్క నీరు లేదు. దిగువన కాళేశ్వరం నుంచి భద్రాచాలం వరకు ఉపనదులు ప్రాణహిత, శబరి , ఇంద్రావతిల వల్ల ఉదృతంగా నీరు వచ్చింది. కానీ ఎగువన మహారాష్ట్రలో వర్షాల లేమితో బాసర నుంచి ధర్మపురి వరకు గోదావరి నీళ్లు లేక మైదానాన్ని తలపిస్తోంది. మంజీరా నదిలో నీటి చుక్కలేదు. దీంతో ఈ సారి పుష్కరాలకు గండం ఏర్పడుతుందని అందోళన వ్యక్తం అయ్యింది.

కానీ జూలై 1 నుంచి గోదావరి మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ గేట్లు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెరుచుకోనున్నాయి. దీంతో కిందకు నీరు వచ్చే అవకాశం ఉంది. ఈ  కారణంగా బాసర, ధర్మపురికి పుష్కరాల కోసం నీరు వచ్చే అవకాశం ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *