పులుల మనుగడతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యం… జనరల్ పీ.ఎస్.సోమశేఖర

పులుల మనుగడతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యం... జనరల్ పీ.ఎస్.సోమశేఖర

 

అభయారణ్యాల్లో పులుల రక్షణకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవాలి

జనవరి నుంచి దేశవ్యాప్తంగా నాలుగో విడత పులుల గణన, తెలంగాణలో తొలిసారి

తెలంగాణ అటవీ శాఖ వర్క్ షాప్ లో పులుల సంరక్షణ అధారిటీ  ఇన్స్ పెక్టర్ జనరల్ పీ.ఎస్.సోమశేఖర

పులుల రక్షణ, మనుగడతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమౌతుందని, వాటి రక్షణకు తగిన చర్యలు తీసుకుంటూనే అభివృద్ది కార్యక్రమాలను కొనసాగించవచ్చని జాతీయ పులుల సంరక్షణ విభాగం (సదరన్ రీజియన్ఇన్స్ పెక్టర్  జనరల్ పీ.ఎస్. సోమశేఖర్ అన్నారు. జనవరి నుంచి దేశవ్యాప్తంగా నాలుగో విడత పులుల గణన మొదలౌతుందని, తెలంగాణలో ఇది మొదటిది అవుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో తెలంగాణ అటవీ శాఖ అధికారులు వర్క్ షాపులో సోమశేఖర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. పులుల జనాభా లెక్కింపుకు అవసరమైన మానవ, సాంకేతిక నైపుణ్యం, అడవిలో వ్యవహరించాల్సిన తీరుపై ఆయన తెలంగాణ అటవీ అధికారులకు ప్రజంటేషన్ ఇచ్చారు. పర్యావరణ సమతుల్యత పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఏటా ఆరు శాతం చొప్పున పులుల సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. తెలంగాణలో ఉన్న కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లు పులుల సంచారానికి అనువుగా ఉన్నాయని, ఈసారి జరిగే లెక్కింపులో వాటి ఉనికిపై స్పష్టత వస్తుందన్నారు. సహజమైన అడవిని కాపాడటం, పులుల సంచారానికి అనువుగా ఉన్న అవాసాలను పునరుద్దరించటం ద్వారా మొత్తం వన్యప్రాణి పర్యావరణాన్నే రక్షించుకోవచ్చన్నారు.

  సారి వన్యమృగ లెక్కింపు దశల వారీగా ఎలా జరుగుతుంది, క్షేత్ర స్థాయి సిబ్బంది ఎలా వివరాలు సేకరించాలి, అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతలపై ఆయన వివరించారు. దూలపల్లిలో ఉన్న అటవీ ప్రాంతంలోకి అధికారులు, సిబ్బందిని తీసుకువెళ్లి కూడా పులితో పాటు, అటవీ జంతువుల పాదముద్రలు, విసర్జితాల వివరాల నమోదును ప్రాక్టికల్ గా ఎలా చేయాలన్నది చూపించారు. డిసెంబర్ మొదటి వారంలో కర్ణాటక బందీపూర్ అటవీ ప్రాంతంలో దక్షిణాది రాష్ట్రాల అధికారులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమం ఉంటుందని తెలంగాణ తరపున హాజరుకావాలని ఆయన ఆహ్వానించారు. ఆతర్వాత తెలంగాణ అటవీ శాఖ అమలు చేస్తున్నకార్యక్రమాలు, మరింత సమర్థవంతంగా సిబ్బంది పనితీరుపై వర్క్ షాప్ కొనసాగింది. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు నిరంతరం కృషి చేయాలని ఉన్నతాధికారులు కోరారు. త్వరలోనే కొత్త సిబ్బంది నియామకాలు పూర్తి అవుతాయని, ప్రభుత్వం అటవీ శాఖకు ఇస్తున్న ప్రాధాన్యతను శాఖలో ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. అటవీ పునరుజ్జీవన చర్యలు, హరితహారం మరింత సమర్థవంతంగా ఎలా అమలు చేయాలి, భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా అటవీ భూముల సరిహద్దులు కచ్చితత్వంతో గుర్తింపు, ప్రాజెక్టులకు భూ సేకరణ వేగవంతం, ప్రత్యామ్నాయ భూముల్లో అడవుల పెంపకం, అవెన్యూ ప్లాంటేషన్ ప్రాధాన్యత, నగర జీవనం నుంచి ఉపశమనం కోసం వీలైనన్న ఫారెస్ట్ అర్బన్ పార్క్ ఏర్పాటుపై విభాగాల వారీగా సమీక్ష జరిగింది. ప్రతీ విభాగం, అధికారి, సిబ్బంది రానున్న ఏడాది కోసం లక్ష్యాలు నిర్దేశించుకుని పరిచేయాలని ఉన్నతాధికారులు సూచించారు

వర్క్ షాపుకు పులుల సంరక్షణ విభాగం అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీ.కె. ఝా, వైల్డ్ లైఫ్ ప్రధాన అధికారి డాక్టర్ మనో రంజన్ భాంజా, అదనపు అటవీ సంరక్షణ అధికారులు, అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్లు, దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ కోట తిరుపతయ్యఅన్ని జిల్లాల అటవీ అధికారులు హాజరయ్యారు

DSC_2905 new....     tiger new

 

 

 

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *