
100కోట్ల పైన వ్యయంతో తెరకెక్కిన చిత్రం పులి ఈరోజు విడుదల కావాల్సి ఉన్నా హీరో, హీరోయిన్లు, నిర్మాతలపై ఐటీ దాడులతో సినిమా విడుదల ఆగిపోయింది.. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన పులి సినిమా తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్ తో పాటు తమిళనాడులో విడుదలవుతోంది.. నిన్న ఆదాయపన్ను అధికారుల దాడులతో వారు సినిమా విడుదల చేసే క్యూబ్ డిజిటల్ సంస్థకు డబ్బులు చెల్లించలేదు. దీంతో ఈరోజు ఉదయం ప్రిమీయర్ షోలు వేయలేదు..
ఎగ్జిబిటర్ లకు కూడా ఇవ్వడానికి వీలు లేకుండా ఐటీ అధికారులు అన్ని దిగ్బంధించారట దీంతో సినిమా విడుదల ఆగిపోయింది.. అమెరికా, కెనడాల్లో కూడా ఈ చిత్రం నిలిపివేశారు. మరో వారం రోజులు గడిస్తే కానీ సినిమా విడుదలవుతుందో లేదో చెప్పలేం.