పులితో ఆట.. జీవన్ రెడ్డికి చేటా..?

తెలంగాణ అసెంబ్లీలో మరో రేవంత్ రెడ్డిలా ప్రవర్తిస్తున్నారు జగిత్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత జీవన్ రెడ్డి.. అసెంబ్లీ సమావేశాల్లో జీవన్ రెడ్డి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. కరువుపై చర్చ సందర్భంగా పోచారం అబద్దాలు చెబుతున్నాడంటూ జీవన్ రెడ్డి పోచారం సీటువద్దకు వెల్లి ఆయన టేబుల్ పైనున్న కాగితాలను చించేశారు. ఈ చర్యతో సభ హుతాషులయ్యింది..

దీనిపై మాట్లాడిన కేటీఆర్.. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఇలా ప్రవర్తిస్తారని ఊహించలేదని.. సభా మర్యదలు కాపాడాల్సిన సీనియర్ నేత ఇలా దుందుడుకుగా వ్యవహరించడం బాగాలేదని మండిపడ్డారు. కాగా దీనిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారట.. రేవంత్ ని టార్గెట్ చేసి మూడు చెరువుల నీళ్లు తాగించి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినట్టు గానే క్రమ శిక్షణ తప్పిన జీవన్ రెడ్డిని సైతం సస్పెండ్ చేయాలని యోచిస్తున్నారట..ఓ వైపు కాంగ్రెస్ పక్షనేత జానారెడ్డి సైలెంట్ గా ఉండగా.. జీవన్ రెచ్చిపోతుండడంతో ఇప్పుడు కేసీఆర్ ఫోకస్ జీవన్ రెడ్డిపై పడిందట.. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *