పురపాలక శాఖ పై మంత్రి కెటి రామారావు సమీక్ష

.

 

పురపాలక శాఖపైన మంత్రి కెటి రామారావు సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ రోజు మెట్రో రైల్
భవన్లో జరగిన ఈ సమావేశంలో జియచ్ యసిం, హెచ్ యండిఏ, జలమండలి, సిడియంఏ విభాగాల అధిపతులు
పాల్గోన్నారు. పురపాలక శాఖ అద్యర్యంలో చేపట్టనున్న జలం-జీవం మీద కార్యాచరణ తయారు చేయాలన్నారు.
ఫిబ్రవరి నెల మెదటి వారంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి
తీసుకునిపోయేలా, సాద్యమైనంత ఎక్కువ మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా ప్రభుత్వ కార్యచరణ
ఉండాలన్నారు. ఈ మేరకు వివిధ కార్యక్రమాలను రూపొందించాలన్నారు. మిషన్ భగీరథ – అర్బన్ కార్యక్రమాన్ని
మంత్రి సమీక్షించారు. ఈ పథకంలో చేపట్టిన పనులను సాద్యమైనంత త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయాలని పబ్లిక్
హెల్త్ ఈయన్ సి కి అదేశాలు జారీ చేశారు. రాష్ర్టంలోని పలు పురపాలికలకు ఇప్పటికే ప్రత్యేక నిధులు ఇచ్చామని,
వాటి ద్వారా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.
హెచ్ యండిఏ కార్యక్రమాలపైన సమీక్ష నిర్వహించిన మంత్రి , సంస్ధ చేపడుతున్న ఉప్పల్ శిల్పరామం పనులు
త్వరగా పూర్తి చేయాలన్నారు. పురపాలికల్లో భవన నిర్మాణ అనుమతులకు నీర్ణిత గడువు పెట్టుకోవాలన్నారు. ఈ
గడువులోగా అనుమతులివ్వకుంటే టియస్ ఐపాస్ అనుమతుల మాదిరి అటోమేటిగ్గా అనుమతులు వచ్చేలా
చూడాలన్నారు. భవన నిర్మాణల అనుమతుల ప్రక్రియలో అలస్యానికి కారణం అయ్యే అధికారులకు జరిమానాలు
విధించే పద్దతిని ప్రవేశ పెట్టాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు. నూతనంగా ప్రకటించిన పార్కింగ్ పాలసీ పైన
మంత్రి రివ్యూ చేశారు. జియచ్యంసి పరిధిలో ప్రయివేటు పార్కింగుకు అవకాశాలపైన ప్రచారం కల్పించాలన్నారరు.
మల్టీ లెవల్ పార్కింగ్లకు టెండర్లు పిలవాలన్నారు. దీంతోపాటు నగరంలో కనీసం వంద పుట్ ఒవర్ బ్రిడ్జిల పనులను
ప్రారంభించాలన్నారు. నగరంలో వచ్చే ఏడాది కాలం పాలు ఎట్టి పరిస్దితుల్లో రోడ్డు కట్టింగ్ అనుమతులివ్వవద్దని
అధికారులకు అదేశాలను జారీ చేవారు. జలమండలి అద్వర్యంలో నడుస్తున్న ప్రాజెక్టుల ప్రాజెక్టు పూర్తి తాలుకు డెడ్
లైన్లు తనకు ఇవ్వాలని మంత్రి జలమండలి అధికారులకు అదేశాలు జారీ చేశారు. రాష్ర్టంలోని పురపాలికల పరిధిలో

ఉన్న పాత పైపులు కాలం చెల్టిన( ఏసి మరియు అర్ సి) పైపులను మార్చేందుకు అవసరం అయిన ప్రణాళికలు
రూపొందించాలని పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ కు అదేశాలు జారీ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *