Breaking News

పీనుగుల మీద పేలాలు..!

stampede3

కొందరి అసమర్థత వల్ల పుష్కర ఉత్సవం శవాల గుట్ట తయారైంది.. ఆ పీనుగుల మీద పేలాలు ఏరుకుంటూ అసమర్థుల అమానుషాన్ని ఎండగడుతున్నారు. ఏపీ సర్కారు చేసిన తప్పిదం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలకు బూస్ట్ ఇచ్చినట్టైంది.. రాజమండ్రి పుష్కర ఘాట్ లో ప్రభుత్వ ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా 37 మంది అమాయక భక్తులు అసువులు బాసారు.

టీడీపీ పుష్కర ఏర్పాట్లలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయలేదు.. అదేదో టీడీపీ సీఎం చంద్రబాబు సొంత వ్యవహారంలా పుష్కరోత్సవం నడిచింది. వీఐపీలు, టీడీపీ నేతలు పుష్కర ఘాట్లలో గంటలకొద్దీ స్నానాలు చేయడంతో భక్తులు వేచి ఉండి తొక్కిసలాట జరిగింది. దీనికంతటికీ చంద్రబాబు, టీడీపీ మంత్రులే కారణమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

కాగా టీడీపీ ఈ విషయంలో మండిపడింది. తమ వల్ల రాజమండ్రి ఘోరం జరగలేదని.. కేవలం భక్తుల తాకిడి ఎక్కువై తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పాయరని ప్రభుత్వ వైఫల్యం లేదని టీడీపీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు సూచించారు. ప్రతిపక్షాల వైఖరి పీనుగుల మీద పేలాలు ఏరుకున్నట్టు ఉందని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *