
‘పీకే’ మూవీకి ఓకే చెప్పింది ఢిల్లీ హైకోర్టు. మూవీలో ఎలాంటి తప్పులు లేవని తేల్చి చెప్పింది. మూవీని నిషేదించాలని దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు కొట్టేసింది. మూవీలో ఎలాంటి వివాదాస్పద సీన్లు లేవని… మతాలను ఇబ్బంది పెట్టేలా ఏమీ మూవీలో లేవని కోర్టు క్లారిటీ ఇచ్చింది. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ భారీగా కలెక్షన్లు సాధిస్తోంది. మూవీలో ఎలాంటి తప్పుడు సీన్లు ఏమీ కనిపించలేదని కోర్టు పిటిషనర్లకు చెప్పింది. మూవీలో హిందూ మతాన్ని కించపరిచారంటూ కొన్ని రోజులుగా ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీకి చెందిన నేతలు ఆందోళనలు చేశారు. ‘పీకే’ మూవీకి చెందిన పోస్టర్లను చించేశారు. మూవీని నిషేదించాలని డిమాండ్ చేశారు.