దీపికా పదుకొనే, ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘పీకు’. ఈ హిందీ చిత్రం ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లో 3 లక్షల హిట్స్ సాధించి అందరినీ అలరిస్తోంది. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో దీపికా తండ్రిగా అమితాబ్ నటిస్తున్నారు. బెంగాలీ యువతిగా దీపిక నటిస్తోంది. మే 8న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.