పీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం, కక్ష్యలోకి 5 ఉపగ్రహాలు

first-launch-pad-in-satish-dhawan-space-centre

ఐదు భారీ ఉపగ్రహాలను నింగిలోకి చేర్చి పీఎస్ఎల్వీ -ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. శుక్రవారం రాత్రి 9.58 నిమిషాలకు ఐదు భారీ విదేశీ ఉపగ్రహాలతో ప్రయోగించిన పీఎస్ఎల్వీ ఉప్రగహాలు 19 నిమిషాల 12 సెకన్లలో నిర్ధేశించిన కక్ష్యలో చేరుకున్నాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగితేలారు.

వాణిజ్య ఒప్పందం, విదేశీ మారక నిల్వలు ఆర్జించేలా ఇస్రో ఈ ప్రయోగాన్ని వాడుకుంది. కోట్ల డబ్బులను తీసుకొని బ్రిటన్ కు చెందిన ఐదు ఉపగ్రహాలను ఇస్రో శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించింది.

ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకు 180 కోట్ల లాభం వచ్చిందని ఇస్రో వర్గాలు తెలిపాయి.ఈ ప్రయోగం ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య ప్రయోగంగా ఇస్రో చైర్మన్ వ్యాఖ్యానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *