Breaking News

పీఎం ములాయం.. డిప్యూటీ పీఎం రాహుల్ అయితే ఓకే..

akhilesh-yadav-mulayam-singh-rahul-gandhi

లక్నో: లక్నోలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు లో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మీరూ మంచి ఫ్రెండ్స్ అని.. అలాంటప్పుడు 2017 లో జరిగే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా అని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన సీఎం అఖిలేష్.. మా తండ్రి.. సమాజ్ వాదీ అద్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిలబడాలని, రాహుల్ గాంధీ ఉప ప్రధాని అయితే కాంగ్రెస్ తో పొత్తుకు అభ్యంతరం లేదని చెప్పారు. కాగా ఇదే సభలో హాజరైన రాహుల్ గాంధీ ఈ మాటలకు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించింది.. యూపీలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని  కాంగ్రెస్ ప్రతినిధి ఢిల్లీలో స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *