పిల్లవాడు. కానీ చిచ్చర పిడుగు

పిల్లవాడు. కానీ చిచ్చర పిడుగు

ఐదేళ్ల చిచ్చరపిడుగు.

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు కంఠస్తం

పిల్లవాడు. కానీ చిచ్చర పిడుగు. పట్టుమని ఐదేళ్లు కూడా లేవు.చదువుతున్నది యు.కే.జీ.కానీ మహా,మహా ఇంజనీర్లు కూడా గుర్తు పెట్టుకోని సమాచారాన్ని అశువుగా చెబితే మంత్రి హరీశ్ రావు,తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, దేవీప్రసాద్, సహా పలువురు చీఫ్ ఇంజనీర్లు,ఇరిగేషన్ రంగంలో కాకలు తీరిన వారు నివ్వెర పోయారు. కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మడి హట్టి నుంచి మెడిగడ్డ పాయింట్ కు ఎందుకు మార్చారో,మహారాష్ట్ర అభ్యంతరాలు, కేసీఆర్ దూరద్రుష్టిని నెహాల్ అనే ఐదేళ్ల బాలుడు అలవోకగా చెబుతున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన హనుమంతరావు హైదరాబాద్ షాపూర్ నగర్లో ఒక ప్రవేటు కంపెనీలో చిరుద్యోగి. కొడుకు నేహాల్ ప్రాజెక్టుల గురించి అనర్గలంగా మాట్లాడుతూ ఉండగా మంత్రి దృష్టికి టి.ఆర్.ఎస్.నాయకుడు తీసుకు వచ్చారు. జలసౌధ లో వందలాది మంది ఇరిగేషన్ ఇంజనీర్ల సమక్షంలో నెహాల్ తన జ్ఞాపకశక్తిని,మేధాశక్తి ని ప్రదర్శించాడు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల గురించి కూడా నెహాల్ కాచివడబోశాడు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ కు Brand ambassador గా  ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన నెహాల్ (5) ను నియమిస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, ముఖ్యమంత్రి కేసీఆర్ రీ డిజైన్ చేసిన తీరు గురించి అలవోకగా,అనర్గళంగా దాదాపు 20 నిముషాలపాటు  నెహాల్ తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించాడు. యు.కె.జి చదువుతున్న నెహాల్ తెలంగాణ ప్రాజెక్టు లు ఆయకట్టు, ఇతర ప్రయోజనాలపై ఐదేళ్ల బాలుడు ప్రసంగించిన తీరుపై అందరూ ఆశ్చర్యపోయారు. నెహాల్ చదువుకయ్యే ఖర్చు మొత్తం ఇరిగేషన్ శాఖ భరిస్తుందని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.తనకు తాత సి.ఎం.కెసిఆర్ ను కలవాలని  నెహాల్ అన్నాడు. త్వరలోనే ఆ కోరిక నెరవేరుస్తానని హరీష్ హామీ ఇచ్చారు. అలాగే నెహాల్ తో పాటు ఆతని కుటుంబ సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకు వెళ్లి చూపాలని సి.ఈ హరిరామ్ ను మంత్రి ఆదేశించారు.నెహాల్ కు గొప్ప ఉజ్వల భవిష్యత్తు ఉందని హరీశ్ రావు అన్నారు.

harish rao 1     nehral

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *