
విజయవాడ, ప్రతినిధి : పిల్లల్ని కని జనాభా పెంచాలని చంద్రబాబు ఆంధ్రా జిల్లాల పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాభాలో భారత్ దూసుకుపోవడంతో 15 ఏళ్ల క్రితం జనాభాను నియంత్రించాలని కుటుంబ నియంత్రణ ప్రవేశపెట్టామని.. కానీ జపాన్, బ్రిటన్ లాంటి దేశాల్లో వృద్దుల సంఖ్య పెరిగి .. పిల్లల సంఖ్య తరుగుతోందని పేర్కొన్నారు. దీనివల్ల అక్కడ యువతరం లేక అభివృద్ది ఆగిపోతోందన్నారు. జపాన్ లో వృద్దుల సంఖ్య విపరీతంగా పెరిగిందని..అక్కడ పిల్లల్ని కనక పనిచేసే వారు కరువవుతున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
మనం కూడా జపాన్ దేశ పరిస్థితిని తెచ్చుకోకుండా యువకులందరూ పెళ్లి చేసుకొని పిల్లల్ని విరివిగా కనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష వైసీపీ నాయకులు మండిపడ్డారు. ఎవరైనా ప్రజలకు మంచి చెప్తారని.. కానీ సీఎం చంద్రబాబు ఇలా జనాభా పెంచాలని పిలుపునివ్వడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు మతి భ్రమించిందని విమర్శించారు.