పిల్లల్ని కనడం భారం అనుకుంటున్నారు..

కాలం మారుతున్న కొద్ది మనిషి సుఖపడిపోతున్నాడు. బొత్తిగా కష్టమంటే భరించట్లేదు. అభివృద్ది చెందిన దేశాల్లోనైతే పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. అక్కడ మహిళలు పిల్లలు కనేందుకు  ముందుకు రావడం లేదని సర్వేలో తేలింది.. గర్భం ధరించే రేటు యూరప్ లో చాలా పడిపోయిందట.. అంటే జననాల సంఖ్య బాగా తగ్గిందన్నమాట.. అదే సమయంలో వృద్ధులు పెరిగిపోయి యూరప్ లో సామాజిక మార్పులు వస్తున్నాయి. జనాభా పెరగక.. వృద్ధాప్యం తగ్గక దేశ ఆర్థిక వృద్ది రేటుపై ప్రభావం చూపుతోందట.. దీంతో దేశాలకు మ్యాన్ పవర్ లేక అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాయని సర్వే లో తేలింది. దీనివల్ల భవిష్యత్తులో ఆ దేశాల్లో దారుణ పరిణామాలు తలెత్తే అవకాశాలున్నాయి..

పిల్లల్ని కనడం యూరోప్ లో మహిళలు భారంగా భావిస్తున్నారట.. ఎంతసేపు డేటింగ్ లు, ఎంజాయ్ చేస్తూ గర్భాదరణను కొనసాగించడం లేదట..  ఐరోపాలో జననాల రేటు కన్నా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోందట.. ఇదే సమయంలో అమెరికాలో మాత్రం రివర్స్ లో మరణాలు తక్కువగా.. జననాలు ఎక్కువగా ఉంటున్నాయట.. ఇటీవల జరిగిన ఓ అంతార్జాతీయ సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి.. యూరప్ లో స్కూళ్లలో పిల్లల సంఖ్య తగ్గుతూ అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోందట… ఇలానే కొనసాగితే యూరప్ అంతా వృద్ధులతో నిండి పనిచేయడానికి దొరకక దేశ ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయని అక్కడి ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించే పనిలో పడ్డాయట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *