
కేంద్రప్రభుత్వం పాస్ పోర్టు జారీ లో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి సరళతరం చేసింది.. ఇందులో భాగంగా మొదట పాస్ పోర్టు అధికారులు పోలీసుల వెరిఫికేషన్ లేకుండా పాస్ పోర్టు జారీ చేస్తారు. ఈ కొత్త రూల్ ప్రకారం ప్రయారిటీ బేసిస్ పై పాస్ పోర్టు కార్యాలయం సాధారణ పాస్ పోర్టులను జారీ చేస్తుంది. అనంతరం పోలీసు వెరిఫికేషన్ ఎప్పుడైనా జరిపిస్తుంది.
ఇన్నాళ్లు పాస్ పోర్టు కోసం ప్రజలందరూ తనపై క్రిమినల్ కేసులు ఉన్నాయో లేదో నిరూపించుకోవాల్సి వచ్చేది. దీనికోసం పోలీసుల విచారణ కంపల్సరీగా జరిగేది.. కానీ నేడు మార్చిన నిబంధనల ప్రకారం తనపై క్రిమినల్ కేసు ఏదీ లేదని.. ఒక వ్యక్తి దరఖాస్తుతో పాటు ఆధార్ ఓటరు ఐడీ, పాన్ కార్డు కాపీలతో కూడిన అఫిడవిట్ ను దాఖలు చేస్తే పాస్ పోర్టు ముందుగా జారీ చేస్తారు. ఆన్ లైన్ ఆధార్ వాలిడేషన్ ను పరిగణలోకి తీసుకొని పాస్ పోర్టు జారీ చేస్తారు. అనంతరం పోలీస్ వెరిఫికేషన్ ఎప్పుడైనా చేస్తారు. పాస్ పోర్టు మాత్రం మన చేతికి తొందరగా వస్తుంది..