పాసుపుస్తకాలను తిరిగి రైతులకు వాపస్ చేయాలని బ్యాంకర్లకు ఇరిగేషన్, మార్కెటింగ్ మంత్రి విజ్ఞప్తి

పాస్ పుస్తకాలు వాపస్ చేయండి.

సి.ఎం.కృషి వల్ల భూరికార్డుల ప్రక్షాళన.

స్కెల్ ఆఫ్ ఫైనాన్స్ కింద అప్పులివ్వాలి.

కోల్డ్ స్టోరేజ్ లకు నాబార్డు లోన్ ఇవ్వాలి.

-మంత్రి హరీశ్ రావు.

తమ వద్ద ఉంచుకున్న పాసుపుస్తకాలను తిరిగి రైతులకు  వాపస్ చేయాలని బ్యాంకర్లకు ఇరిగేషన్, మార్కెటింగ్ మంత్రి విజ్ఞప్తి చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో దాదాపు 8 దశాబ్దాలుగా జరగని భూముల రికార్డులను సంపూర్ణంగా ప్రక్షాళన చేశారని అన్నారు. నాబార్డు రూపొందించిన ‘2018–19 రాష్ట్ర రుణ విధానపత్రా’న్ని మంత్రి హరీశ్‌రావు మంగళవారం విడుదల చేశారు. పంట రుణాలు తీసుకోవడానికి పాసు పుస్తకాలు అవసరం లేదన్నారు. రైతుల పూర్తి సమాచారం ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నందున  వెరిఫికేషన్‌ పేరిట రైతుల నుంచి తీసుకున్నాయన్నారు. కానీ వాటిని ఇప్పటికీ వెనక్కు ఇవ్వలేదని మంత్రి చెప్పారు. వాటిని తిరిగి వెనక్కు ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని ఆయన నాబార్డు అధికారులను కోరారు. రైతులకు మే–జూన్‌ నెలల్లోనే పంట రుణాలు అందజేయాలని కోరారు. ప్రభుత్వం ఎకరానికి  4 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నట్టు మంత్రి గుర్తు చేశారు.  స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు ఇవ్వకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తంచేశారు.

harish rao 1     harish rao 3     harish rao 5

కోల్డ్‌ స్టోరేజీలకు నాబార్డు రుణం అందజేయాలని హరీశ్ రావు కోరారు. మిషన్ కాకతీయ కార్యక్రమంతో అద్భుతమైన పంట దిగుబడి వస్తున్నట్టు తెలిపారు. పూడికతీత మట్టితో దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. క్రాప్ లోన్ కోసం రైతుల పాస్బుక్ లను తీసుకోవద్దని   బ్యాంక్ లను ఆదేశించిందని మంత్రి గుర్తు చేశారు.ఇది ముమ్మాటికీ రైతు సంక్షేమ ప్రభుత్వమని,నాబార్డు కూడా తెలంగాణ రైతుల ప్రయోజనాలకనుగుణంగా సహకరించాలని మంత్రి కోరారు.మిషన్ కాకతీయ కార్యక్రమం అమలుపై నాబార్డ్ కు చెందిన నాబ్కాన్ సంస్థ అధ్యయన నివేదికను తాను కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీ కి కూడా ఇచ్చినట్లు హరీశ్ రావు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో గోడౌన్ల నిర్మాణానికి గాను 1000 కోట్ల ఆర్ధిక తోడ్పాటు అందించిన నాబార్డు కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

harish rao 4    harish rao 6

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *